2026 – రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు బహుమతి ప్రధానం.

జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సైన్స్ ప్రయోగాల వీడియో పోటీలు నెలరోజుల పాటు ఆన్లైన్లో నిర్వహించబడినాయి. అందులో విజేతలను రాష్ట్రస్థాయి వర్చువల్ సమావేశంలో *రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్ , విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్.లక్ష్మణరావు గారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకతను, హేతుబద్ధతను , శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకుగాను సైన్స్ ప్రయోగాల వీడియో కంటెస్టుని నిర్వహించడం జరిగిందన్నారు. జెవివిగా ఇటువంటి విద్యా విషయక కార్యక్రమాల్ని కొనసాగిస్తామని తెలిపారు. భవిష్యత్తులో 1000 కి పైగా ప్రయోగాలు విద్యార్ధులు చేసి పంపేలా కృషి చేయాలని తెలిపారు.
జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్, యూత్ సోషల్ మీడియా విభాగం నాయకులు మహేష్, వీడియో కంటెస్టు న్యాయ నిర్ణీతలు ఎమ్మెస్ యుగంధర్ బాబు, కె ఎస్ జిలాని భాషాలు మాట్లాడుతూ సైన్స్ బోధన ,అభ్యాసం ప్రయోగాలు కృత్యాల ద్వారా చేస్తే సమగ్ర అభ్యసన సాధ్యమవుతుందని తెలిపారు.
రాష్ట్రస్థాయిలో వందలాదిమంది విద్యార్థులు వినూత్నమైన ప్రయోగ వీడియోలు రూపొందించి సైన్స్ పట్ల తమ జిజ్ఞాసను తెలియజేశారన్నారు. విద్యార్థినీ విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు.

జెవివి విద్య విభాగం సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన మొదటి మూడు టీముల విద్యార్థిని విద్యార్థులకు 26 జిల్లాల్లో మొదటి రెండు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు జనవిజ్ఞాన వేదిక బహుమతులను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పోటీలో పాల్గొన్న ప్రతి విద్యార్థినీ విద్యార్థికి ఈ సర్టిఫికేట్ పంపడం జరుగుతుందని తెలిపారు.
ఆశాస్త్రీయ భావాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ దృక్పథం పెంచే కృషిలో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థులు భాగస్వామ్యం కావాలని కోరారు.
సమావేశంలో జె వి వి రాష్ట్ర నాయకత్వం కాంటెస్ట్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
జె వి వి ఏపీ 2026 రాష్ట్రస్థాయి ఆన్లైన్ సైన్స్ వీడియో పోటీల విజేతల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
జిల్లాస్థాయి విజేతల వివరాలను ఆయా జిల్లా బాధ్యులకు అందజేయడం జరిగిందని వారు తెలిపారు.
G.Giridhar, Convenor, Education Sub Committee, 8500960840
జన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ (జె వి వి ఏపీ)

Eureka-2026-Final-Result

Leave a Reply